Why bicker , bro. You live your life. And let him, his.

Here is somethingin Telugu, for such siblings that are at loggerheads with each other.
I’ll try to translate it into English , a while, soon.

నాకు నాదో విజ్ఞప్తి:

భూమి తిరుగుతోంది, కాలం గడుస్తోంది.
మనుషులు మారుతున్నారు, రోజుల్ని మారుస్తూ.
సమాజంలో మార్పులు తెర్లుతున్నాయి,
కడలిపై కెరటాలులా,
అప్పుడప్పుడు సమస్యలకు సమాధానాలు తెస్తూ,
మరి కొన్ని సార్లు సుడిగుండాలను, ఉపరితల ద్రోణులను
(నేను సైతం గొప్ప మాటలు ……….)వెంటబెట్టుకునీ,
సమస్యలను జటిలం చేస్తూ, దుర్ఘటనలనూ, విస్ఫోటనాలనూ
ప్రపంచం నలు దెసలలో యెక్కడెక్కడి నుంచో తోడి తెచ్చుకునీ,
అంతూ పొంతూ లేని ఈ ఆటూ పోటుల కెరటాలముందు నా సమస్యలేపాటివో,
ఈ కక్షలేపాటివో, ఆకాంక్షలే పోటీవో?
నా వాకిలో, నా ఇల్లో, నా ఊరో, నా నుయ్యో, నా దేశమో వీడి ప్రపంచంలోకి పోయి చూడాలేమో ?
అప్పుడైనా తెలుస్తుందో లేదో, నా కాంక్షలూ, నా కక్షలూ అర్ధ రహితమైనవో, సార్ధకమైనవో?
అవి,కదలీ కడలి కెరటాలపై నురువుపిండి బుడగల వంటివేనేమో?
అవును కాదేమో ?
యెంత చెట్టుకి అంత గాలి.
నా సమస్యలు నాకు అగమ్యం,
నా అహం నాకు రమ్యం.
నిజమే.
ఆయినా నేను సైతం, ………..
ఆ నీవు సైతానా? ,
(నేను కాదు,నీవే సైతాన్, నీ అబ్బ సైతాన్,
నీ అమ్మ సైతాన్, అదే మన అమ్మ సైతాన్.
మన అమ్మా? అదెక్కడుంది? నీ యెంకమ్మా?
అవును నీది యెనకమ్మా, నాది ముందమ్మా, గుర్తుంచుకో.)
ఆ ఎక్కడున్నాం మనం, అదే నేను,
ఆ , పేను సైతం,
ఐ మీన్ నేను పైత్యం….
సారీ పేను పైత్యం
అదే నేను సైతం,(అమ్మయ్య!)
తాము సైతం,
(త్వమేవాహం కనుక , క్షమించాలి)
గల్లీలో తమ్మి సైతం,
గొంది లోఅన్న, సరే తంబి, సైతం
సమస్యలు తెచ్చిపెట్టుకోవటం, ఇతరులకు తెచ్చిపెట్టటం,
సమస్యలను తీర్చడం వలె కష్టం కాదు గనుక,…
సమాజానికి ఉన్న సమస్యలకు తోడు
కొత్తవి నా మూలంగా, మన మూలంగా ఏర్పడకుండా,
మనం ఇంకా వేర్పడకుండా, (మళ్ళీ త్వమేవాహమా?హన్నా?)
చెయ్యగలిగిన ప్రయత్నం చేయ రాదా ?
చెయ్యి రాదా?

Advertisements

About versa kay

Agile, keen, versatile,considerate,patient
This entry was posted in Code of conduct, literature, poetry, Wildlife and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s