prabhatam

పక్కదిగి నెట్ రౌటర్ ఆన్ చేశాను. ఈ మధ్య మా ఇంటి సమీపంలో పిడుగు పడినప్పుడు రౌటర్ కాలిపోయినప్పట్నుంచి, అవసరంలేనప్పుడు నెట్ ఆఫ్ చేసి పెడుతున్నాను.వంటిట్లొంచి పోపు ఘుమఘుమ , కాఫీ ఆరొమా వస్తున్నయి. అప్పుడే శ్రీమతి స్నానం కూడా అయినట్టున్నది. కొందరి ఇళ్లలో కాఫీ పరిమళం గొప్పగా వస్తుందీ, నల్ల బురఖా తొడుక్కోకపోయినా, కాఫీ రంగు మిడి తొడుక్కుంటే చాలు.మమకారపు మాధుర్యం!దొడ్డి తలుపు చప్పుడైంది. పని అమ్మాయి వచ్చినట్టుంది. తలుపు చలికి బిగుసుకున్నది. గట్టిగా రెండు తంతే గాని ఊడలేదు. వడ్రంగిని పిలవాలి. చిన్న పనులకి తొందరగా రారు.ఇంకా ఒకటి రెండు పనులు లిస్ట్ చెయ్యాలి. కొబ్బరికాయ వొకటి రాత్రి వానకి రాలి పడింది. చెట్టు యెక్కి కోసే వాళ్లు కరువైపోయారు. నిన్నటి వానకి నేల బాగా తడిసింది. కొంత ఆరినా, ఇంకా కాలికింద చల్లగా , స్పాంజిలా ఉంది. పక్కయింటి ఆమె , చిన్న బుట్ట లో వాళ్ళపెరటి పూలు, ప్రహరీ మీద పెట్టి వెళ్ళినట్లున్నారు. . మనసులోనే థాంక్స్ చెప్పుకుని, తీసుకున్నాను.మన మొక్కలవి గూడా కోసుకోవాలి. పూల బుట్ట, కొబ్బరికాయా పుచ్చుకుని ఇంట్లో కి బయలు దేరాను. బయట ముందు తలుపు చప్పుడైంది. పేపర్ బాయి పేపర్ చుట్ట చుట్టి విసిరినట్టున్నాడు. పాలవాడి గొంతు వినరాలేదు. ఇంకా పాలు పెట్టలేదు.”అయ్యో ముఖం కడుక్కోకుండా ఆ పూలు ముట్టుకున్నారా.” “పర్వా లేదులే కాసిని మడి నీళ్ళు నువ్వు చల్లు.”
నెట్ ఆన్ చేశాను. గయ్యాళి భార్యను టూత్‌పిక్ తో యెలా దండించాలో విజ్ఞులు చర్చిస్తున్నారు. యేదో కరువొచ్చినట్లు టూత్‌పిక్ తో దేనికి, చింత బరికలో, ఈత బరికలో, ఖర్జూర బరికలో వాడుకోవచ్చుగదా. బహుశా మీరు టూత్‌పిక్ వాడితే అమే చింత బరికె తీసుకునే వీలుంటుందనేమో? యేదొ సామెత చెప్పినట్లు, “తమలపాకుతో నీవిట్లంటే తలుపు చెక్కతో నేనిట్లంటా” అని.అసలు టూత్ పిక్ తో దండించటమెల్లా అబ్బా? టూటాఖామెన్ మహరాజు కేమన్నా తెలుసేమో ? టూత్‌పిక్ తో మహా అయితే మందలించవచ్చు అంతే. బహుశా దాంతో గుచ్చమనికాబోలు అంతరార్ధం. పూర్వంప్రేమ యెక్కువైతే నఖక్షత , దంతక్షతాలతో వ్యక్త పరచే వారట. ఇప్పుడు ప్రయత్నిస్తే మంచం మీదినుంచి కిందకి పడ దోస్తారు జాగ్రత్త.యాక్యూపంక్చర్ తెలిసిన వాళ్లకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. భార్య ఆర్థ్రైటిస్ గూడా తీరిపోవచ్చు.
టీవీ ఆన్ చేశాను, అల్పాచమానానికో, బహిర్భూమికో వెళ్ళినప్పుడో అవలంబించవలసిన శాస్త్రోక్త విధివిధానాలు యెవరో మహానుభావులు బోధిస్తున్నారు. స్కూల్లో మా మిత్రుడొకడు ఒకటికి వెళ్ళేటప్పుడు బ్లాటింగ్ పేపరు తీసుకు వెళ్తుండే వాడు. ఇవన్నీ గూడా చెప్పాలా? చెత్తబండీ విజిల్ వినపడింది. చెత్తబుట్టలో వర్షం నీళ్లు పడ్డాయి. దోమలు మామిడి టెంకల మీద మూగుతున్నాయి. ఈ మధ్య ఈగలు కానరావడంలేదేమిటబ్బా ? హిట్ డబ్బా తీసుకువెళ్ళి స్ప్రే చేసాను. ఇది జీవహింస కిందికి వస్తుందా రాదా ? బుట్ట తీసుకుని వెళ్లి వాకిట్లో పెట్టాను.ఈ మధ్య వాన్లు ఇచ్చిన తర్వాత , బుట్ట గేట్ దగ్గిర పెడితేగాని కలెక్ట్ చేసుకోవడంలేదు. చేతులు డెట్టాల్ తో కడుక్కుంటున్నాను. “ఒక్క క్షణం శ్రద్ధ వహిస్తే ఆరోగ్యానికి యెంతో మంచిది “అని టీ వీ లో నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నారు.”ఏమండీ .కాస్త ఇటు వస్తారా, యెప్పుడు, స్మార్ట్ ఫోను, కంప్యూటర్ ధ్యాసేనా. కాస్త వంటింటి వైపుగూడా తొంగి చూడండి మహానుభావా . ఇంట్లో వున్నారనేగానీ ఒక్క పనికి ఆస్కారం లేదు.” “వుండవే బాబూ. పనిలో ఉన్నాను.” ఫోన్ పక్కనబెట్టి , “బాత్ రూం కి అర్జెంట్ గా వెళ్ళాలి.” ఆలోచన వుంటే మరుగుదోడ్డి అదే వస్తుంది.
అమ్మయ్యా. ఓ పనైపోయింది. ఇక స్నానం తరువాయి. అసలు పళ్ళు తోముకున్నానా ఇంకా ?
“నల్ల వస్తున్నట్లుంది.కాస్త ప్రొద్దున్నే స్నానం చేసి కూర్చోవచ్చుగదా ప్రొద్దున్నే ఆ కంప్యూటర్ పట్టుకు కూర్చోక పోతే. పెద్దవాళ్ళు అవుతున్నారు. కాస్త మడీ దడీ లేకపోతే యెట్లా.సంప్ టాప్ బంద్ చెయ్యండి. మడి నీళ్ళు పట్టుకుంటాను.”
“కొద్దిసేపే వస్తున్నాయి నీళ్ళు. అవి గూడా సంప్ లో పడకపోతే బాత్రూంకి ఇబ్బంది అవుతుంది, యెట్లా? తొందరగా పట్టుకో నీ మడి నీళ్ళు” .
సంప్ నల్ల క్లోజ్ చేశాను.

About versa kay

Agile, keen, versatile,considerate,patient
This entry was posted in Uncategorized and tagged , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s